ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSDC: ఏపీఎస్టీసీ యాక్టు 2020ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌.. నేడు విచారణ - PUBLIC INTEREST LITIGATION hearing IN HIGH COURT

తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ యాక్టు 2020 సెక్షన్ 12ను సవాల్ చేస్తూ.. ఆయన పిల్ దాఖలు చేశారు.

PUBLIC INTEREST LITIGATION IN HIGH COURT ON APSDC PROPERTIES
ఏపీఎస్టీసీ యాక్టు 2020ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌.. నేడు విచారణ

By

Published : Jul 6, 2021, 12:40 PM IST

తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ యాక్టు 2020 సెక్షన్ 12ను సవాల్ చేస్తూ.. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిల్‌ దాఖలు చేశారు.

అసలేం జరిగింది

విశాఖ భూములను.. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ పేరిట బదిలీ చేసి 25 వేల కోట్ల రుణాన్ని పొందాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్టీసీ (APSDC)కి బదిలీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును నేరుగా ఏపీఎస్టీసీకి అప్పగించేందుకు వీలు కలిగిస్తున్న చట్టాలను రద్దుచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమచేయకుండా ఏపీఎస్టీసీ కి దారాదత్తం చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఎస్టీసీ (APSDC) చైర్మన్, విశాఖ జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకునేందుకు ఈ తరహాలో ఆస్తులను ఏపీఎస్టీసీ కి ఉచితంగా భూములను బదలాయించడం అధికరణ 219ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తితిదేలో ప్రభుత్వ జోక్యం అనవసరం : పయ్యావుల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details