అమరావతిపై అసత్య ప్రచారం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏదో జరిగిందని అపోహలు స్పష్టించి... అమరావతిని చంపేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతి ప్రజారాజధాని పేరిట విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 'నేను సవాల్ విసురుతున్నా. ఏదైన తప్పులుంటే చర్యలు తీసుకోండి. దానికి నేను అడ్డురాను. కానీ ఆ నెపంతో అమరావతి చంపేందుకు ప్రయత్నిస్తే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది" అని చంద్రబాబు అన్నారు.
'రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగితే నిరూపించండి' - రాజధాని అమరావతి
అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తన మీద కక్షతో అమరావతి చంపొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు జరిగిందని తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని అన్నారు.

చంద్రబాబు