ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రంజాన్‌ ప్రార్థనలకు మార్గదర్శకాలు - ap latest news updates

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నమాజ్‌కు హాజరుకావాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూ, 144వ సెక్షన్లను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది.

Ramzan prayers
Ramzan prayers

By

Published : May 12, 2021, 8:25 AM IST

రంజాన్‌ ప్రార్థనలకు మార్గదర్శకాలు

  • ఈద్గా, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజ్‌ల నిర్వహణపై నిషేధం. ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించాలి
  • 50 మంది మాత్రమే మసీదుల్లో నమాజు నిర్వహణకు అనుమతి. భౌతిక దూరం పాటించాలి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఒకటి రెండు సార్లు బృందాలుగా వెళ్లి ప్రార్థనలు నిర్వహించాలి. మాస్కు లేని వారిని అనుమతించకూడదు.
  • నమాజు నిర్వహణకు అవసరమైన ప్రేయర్‌ మ్యాట్‌ను ఇంటి నుంచే తీసుకెళ్లాలి.
  • కరచాలనం, బంధువుల ఇంటికి వెళ్లటం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవటం చేయకూడదు.
  • సాధ్యమైన మేరకు రంజాన్‌ ప్రార్థనలను ఇంటి నుంచే నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సూచించారు.

ABOUT THE AUTHOR

...view details