ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారతాయా...?: అమరావతి రైతులు - three capitals for ap

అమరావతిలో రైతుల పోరు ఉద్ధృతంగా సాగుతోంది. తుళ్లూరు, మందడం, వెలగపూడితో పాటు ఇతర రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగించారు. మూడు రాజధానులపై తమ ఆందోళనను బలంగా వినిపించారు. మూడు రాజధానులను ఎవరూ ఆపలేరంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలపై రైతులు, మహిళలు మండిపడ్డారు

Protests continue in Amaravati
Protests continue in Amaravati

By

Published : Sep 2, 2020, 2:14 AM IST

Updated : Sep 2, 2020, 5:23 AM IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న నినాదాలతో రాజధాని గ్రామాలు హోరెత్తుతున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, దొండపాడు, అనంతవరం, నేలపాడు, వెంకటపాలెం, అబ్బరాజుపాలెంలో..... రైతులు, మహిళలు మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ గళమెత్తారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా కొవిడ్‌ వైరస్‌ భయపెడుతున్నా తమ పట్టు వీడటం లేదు.

పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారతాయా...?: అమరావతి రైతులు

జీవనాధారం దెబ్బతిని..ఉపాధి, ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ఉద్యమమే శరణ్యమని చెబుతున్న రైతులు.... ఎన్నిరోజులైనా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజధాని అమరావతిపై కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను రైతులు, మహిళలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న అన్నదాతలు.... అమరావతే రాజధాని అని ప్రభుత్వం ఒప్పుకునే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు.

Last Updated : Sep 2, 2020, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details