ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు.. న్యాయం చేయండి'

వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ తండ్రి చనిపోయాడని.. కుమార్తెలు, కుమారులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వాసుపత్రి ఎదుట జరిగింది.

protest with dead body bhadrachalam
ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

By

Published : Nov 18, 2020, 6:39 PM IST

వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల తన తండ్రి మృతి చెందాడని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రభుత్వాసుపత్రి ఎదుట మృతుని కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన పెంటయ్య (55) కడుపులో మంట, ఆయాసం రావడం వల్ల బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆసుపత్రిలో నర్సులు మాత్రమే సెలైన్​ పెట్టారని... పరిస్థితి ఇబ్బందిగా ఉంది డాక్టర్​ వచ్చి చూడాలని కుటుంబసభ్యులు కోరినా వైద్యులు ఎవరూ రాలేదని వారు ఆరోపించారు. దీంతో పన్నెండున్నర గంటలకు తన తండ్రి చనిపోయాడని పెంటయ్య కుమారులు, కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. సీఐ స్వామి.. మృతుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్యులపై ఫిర్యాదు చేస్తే తన తండ్రి మృతదేహానికి పంచనామా చేస్తారని.. లేదంటే అలాగే మృతదేహాన్ని తీసుకువెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

పోలీసులు, గ్రామపెద్దలే చంపారంటూ మృతదేహంతో ధర్నా

ABOUT THE AUTHOR

...view details