రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని మహిళలు, రైతులు డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు చేస్తున్న ఆందోళనలు 443వ రోజుకు చేరుకున్నాయి. గత ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. సీఆర్డీఏ చట్టాన్ని కొనసాగించడం ద్వారానే అమరావతి అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులు అభిప్రాయపడ్డారు.
443వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు
మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసి... అమరావతి నుంచే పాలన కొనసాగించాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. అధర్మంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాజధాని రైతుల ఆందోళనలు
రాజధాని నిర్మాణం కోసమే భూములిచ్చామని.. అమరావతిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. వైకాపా ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రుడా మేలుకో.. అమరావతి రాజధాని, విశాక ఉక్కుని కాపాడుకో అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:ప్రత్యేక హోదా పేరు తప్ప.. ఆ రూపేణా చాలానే నిధులొచ్చాయ్..!