ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై నిరసనలు ఉద్ధృతం - కృష్ణా జిల్లాలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై నిరసనలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి స్పందనపై ఉక్కు కార్మికులు, నిర్వసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినా విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదాలు మరింత హొరెత్తాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలనే వాదనాలు పెరుగుతున్నాయి.

protest against visakha steel plant privatization
నిరసనలు ఉద్ధృతం

By

Published : Mar 9, 2021, 3:19 PM IST

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై నిరసనలు ఉద్ధృతం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు అరెస్టులకు దారి తీశాయి. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేయడాన్ని తప్పుబడుతూ.. జీవీఎంసీ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో..

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని వీఎస్‌పీ లైమ్ స్టోన్ మైన్స్ కార్మిక సంఘాలు చేసే ఆందోళనను ఉద్ధృతం చేశాయి. తాజాగా వెలువడిన కేంద్ర ప్రకటనతో ఆగ్రహించిన కార్మిక నాయకులు.. ప్లాంటు మార్గంలో బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. కేంద్రం దిగి రాకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​ను విక్రయించవద్దు..
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని వామపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. స్టీల్ ప్లాంట్​ను విక్రయించవద్దని ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ సంస్థలు ఆలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ కార్యదర్శి ఎన్​వీ నాయుడు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details