రాష్ట్రంలో కొందరు సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతులు లభించాయి. ముఖ్యకార్యదర్శులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా.. కార్యదర్శులకు ముఖ్య కార్యదర్శులుగా.. మరికొందరికి సంయుక్త కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న రజత్ భార్గవ, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్కుమార్లకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. సెక్రటరీ హోదాలో ఉన్న జి. జయలక్ష్మీ, ఉషారాణి, రామ్‌గోపాల్ ను ప్రిన్సిపల్ సెక్రటరీలుగా అపాయింట్ అయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్ కుమార్‌కు పదోన్నతి పొందారు.
ఇంటర్ క్యాడర్ ట్రాన్స్ఫర్ల ద్వారా రాష్ట్రానికి ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీపై వచ్చారు. నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మంజిర్ జిలానీ సమూన్, తమీమ్ అన్సారియాలకు ప్రభుత్వం విశాఖలో పోస్టింగ్ ఇచ్చింది. వీఎంఆర్డీఏ అదనపు కమిషనరుగా మంజిర్ జిలానీ సమూన్.. జీవీఎంసీ అదనపు కమిషనరుగా తమీమ్ అన్సారియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.