Telugu akademi scam: తెలుగు అకాడమీ కేసులో ఎట్టకేలకు కొంత పురోగతి కనిపించింది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. 10 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడానికి కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించారు. రెండు మూడు రోజుల్లోపు 10 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఉంది.
జరిగిన సంగతేంటంటే..
Telugu akademi fixed deposits scam: తెలుగు అకాడమీకి సంబంధించిన 10 కోట్ల రూపాయలను తెలంగాణలోని చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి డిపాజిట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ సాధనతో చేతులు కలిపిన నిందితులు నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు ఉన్న డిపాజిట్‌ను ఇతర బ్యాంకుకు మళ్లించారు. ఆ తర్వాత నగదును విడతల వారీగా విత్‌డ్రా చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు.. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్‌ను ఇతర ఖాతాలోకి మళ్లించిన వైనాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమీ అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.