సంచలనం రేపిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అత్యాచార కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన ఆస్పత్రి భద్రతా సిబ్బంది విజయ కిశోర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా కొన్ని విషయాలు వెల్లడించాడు. తాను మహిళపై అత్యాచారం చేయలేదని.. మహిళ అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్లు సెక్యూరిటీ గార్డు విజయ కిశోర్ పోలీసులకు తెలిపాడు. గత నెల 27న గాంధీలో సెక్యూరిటీ గార్డుగా చేరినట్లు పోలీసులకు విచారణలో చెప్పాడు. గాంధీ ఆస్పత్రి ఘటనలో అదృశ్యమైన మహిళను హిమాయత్‌నగర్‌లో గుర్తించారు. ఓ మెడికల్ దుకాణం వద్ద సంచరిస్తుండగా నారాయణగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా.. గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన గురించి చెప్పినట్లు వెల్లడించారు.
gandhi hospital rape: అత్యాచారం చేయలేదు.. ఆమె అంగీకారంతోనే వెళ్లా: సెక్యూరిటీ గార్డు - telangana varthalu
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార కేసును పోలీసులు చేధించారు. తాను మహిళపై అత్యాచారం చేయలేదని.. మహిళ అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్లు సెక్యూరిటీ గార్డు విజయ కిశోర్ పోలీసులకు తెలిపాడు.
గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటన
మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5 న మూత్రపిండాల వ్యాధి నయం కోసం వచ్చిన ఓ రోగికి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చారు. తమపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అదృశ్యమైన బాధితురాలి సోదరి కోసం.. విస్తృతంగా గాలించిన పోలీసులు నారాయణ గూడలో గుర్తించారు.
ఇదీ చదవండీ..పార్కు చేసిన కారులో మృతదేహం.. పోలీసుల ముమ్మర దర్యాప్తు