Schools: పాఠశాలకు వెళ్లి రావడం కష్టంగా ఉందని మూడో తరగతిలో 31%, అయిదో తరగతిలో 28%, ఎనిమిదో తరగతిలో 30% విద్యార్థులు జాతీయ సాధన సర్వే-2017లో వెల్లడించారు. ఇప్పుడు పాఠశాలల విలీనంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు పాఠశాలలు అందుబాటులో లేవని సమగ్ర శిక్ష అభియాన్‌కు ఏటా కేంద్రం రవాణా ఛార్జీలను చెల్లిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున కేంద్రం నిధులిస్తోంది. ఈ ఏడాది 41వేల మందికి రవాణా ఛార్జీల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. విలీనంతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
పాఠశాలల విలీనంతో ప్రాథమిక విద్యావ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. కరికులమ్, బోధన, అభ్యసన విధానాల కోసం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంలో మార్పును ఇప్పుడు భౌతికంగా అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీలు, ఒకటి, రెండు తరగతులు కలిపి ఉండే ఫౌండేషన్ పాఠశాలల పర్యవేక్షణలో అనేక ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఒక పాఠశాలలో రెండు శాఖల బడులు కొనసాగనున్నాయి. అంగన్‌వాడీ, ప్రాథమిక బడులను చాలాచోట్ల కలిపేస్తున్నారు. పర్యవేక్షణ మాత్రం ఏ శాఖకు ఆ శాఖే చేయనుంది. ఒకే ప్రాంగణంలో ఉండే వీటికి మధ్యాహ్న భోజనం నుంచి పాఠశాల సమయాల వరకు అన్నీ మారుతాయి.
విద్యా హక్కు చట్టాన్ని మార్చేశారు
విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటరు దూరంలో 1-5 తరగతులకు ప్రాథమిక పాఠశాల ఉండాలి. దీన్ని మార్చేశారు. 3-7/8 తరగతులు ఉండే ప్రీహైస్కూలు, 3-10 తరగతులు ఉండే హైస్కూలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చనే నిబంధన తీసుకొచ్చారు. అంటే భవిష్యత్తులో 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేయొచ్చు. ఇప్పుడు కిలోమీటరు దూరమని చెబుతున్నా ఈ చట్ట సవరణ ప్రకారం మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేయొచ్చు. విద్యాహక్కు చట్టానికి సవరణ చేసినందున పాఠశాల దూరం పెరిగినా విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించక్కర్లేదు.
* గ్రామంలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలు కిలోమీటరు దూరం వరకు ఉండొచ్చనే నిబంధన తీసుకొచ్చారు. శాటిలైట్ పాఠశాలలుగా మారే వీటిని విద్యార్థుల ఆవాసాలకు కిలోమీటరు దూరం తరలించొచ్చు.
అడ్డంకులను పట్టించుకోవడం లేదు