ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భయం భయంగా బడిలో.. - paderu news

దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. మరి ఆ తరగతి గదే కారుతూ.. పాఠశాల మొత్తం శిథిలావస్థకు చేరితే.. విద్య ఎలా అబ్బుతుంది? వర్షం పడితే చాలు.. పైకప్పు నుంచి కారుతున్న నీటి దారల మధ్యే బోధన చేయాల్సిన పరిస్థితిలో ఆ పాఠశాల ఉంది. నూతన భవనం నిర్మించండని అని పలుమార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది అల్లూరి జిల్లాలోని బరిసింగి ప్రభుత్వ పాఠశాల పరిస్థతి. దీనిపై మా ప్రతినిధి ప్రత్యేక కథనం.

బరిసింగి ప్రభుత్వ పాఠశాల
బరిసింగి ప్రభుత్వ పాఠశాల

By

Published : Jul 20, 2022, 3:21 PM IST

పాడేరు ఐటీడీఏకు 2కిలోమీటర్ల దూరంలో ఉన్న బరిసింగి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 22 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలకు సరైన భవనం లేక ఆరుబయట వరండాలోనే చదువుకుంటున్నారు. నాలుగు, ఐదు తరగతి విద్యార్థులైతే వంటశాలలోనే విద్యనభ్యసించ వలసిన పరిస్థితి ఏర్పడింది. బడికి పంపాలంటేనే భయంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

వర్షం వస్తే..

వర్షాలకి పాఠశాల మొత్తం కారుతుండటంతో.. వరండాలోను, వంటగదిలోనూ బోధిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయురాలు చెబుతున్నారు. నూతన భవనం నిర్మించమని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నట్లు కూడా తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details