ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు వర్సిటీల్లో 2వేలకుపైగా కన్వీనర్‌ కోటా సీట్లు - ప్రైవేటు యూనివర్సీటీ కన్వీనర్ సీట్లు

ప్రైవేటు వర్సిటీల్లో 35శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తాము నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇకపై ఈఏపీసెట్​లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ జరగనుంది.

private university  quota
private university quota

By

Published : Aug 8, 2021, 7:29 AM IST

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా అమలుతో ఇంజినీరింగ్‌లో రెండు వేలకుపైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ వర్సిటీల్లో 35% సీట్లను కన్వీనర్‌ కోటాలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తాము నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇకపై వాటిలోని మొత్తం ఇంజినీరింగ్‌ సీట్లలో 35%... ఈఏపీసెట్‌ లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. సాధారణ డిగ్రీ కోర్సులకు ఇంటర్‌ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ సీట్లకు ఫీజులను ఉన్నత విద్యా కమిషన్‌ నిర్ణయిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details