కొవిడ్-19 నివారణ, సహాయ చర్యలకు సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ది సీ పుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్ రూ.8.60 కోట్ల విరాళం ఇచ్చింది. ఏపీ రీజియన్ అధ్యక్షుడు ఎ.ఇంద్రకుమార్ సీఎంకు చెక్కు అందించారు. డీమార్ట్ సంస్థ రూ.5 కోట్లు విరాళం అందించింది. మంత్రి పేర్ని నాని ద్వారా సీఎంకు విరాళం అందించినట్లు డీమార్ట్ సంస్థ తెలిపింది. శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ 2 కోట్లు విరాళం అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆ సంస్థ సీఈవో ఆడారి ఆనంద్ చెక్కు అందించారు. సీఎంఆర్ఎఫ్కు దేవీ ఫిషరీస్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. సీఎంను కలిసిన ఆ సంస్థ డైరెక్టర్లు సురేంద్ర, వీర్రాజు ముఖ్యమంత్రికి చెక్కు అందించారు. సీఎం సహాయనిధికి మాధవి ఎడిబుల్ బ్రాన్ ఆయిల్స్ లిమిటెడ్ రూ.20 లక్షలు విరాళం ఇచ్చింది. ఆ సంస్థ ఎండీ మాధవిబాబు,ఈడీ పట్టాభిరామచౌదరి సీఎంకు చెక్కు అందించారు.
దాతల దాతృత్వం.. సీఎం సహాయనిధికి విరాళాలు - సీఎం సహాయనిధికి విరాళాలు వార్తలు
కరోనా సహాయ చర్యలు చేపట్టేందుకు పలు ప్రైవేట్ సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందించాయి. శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్, దేవీ ఫిషరీస్, ది సీ పుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్, డీమార్ట్, మాధవి ఎడిబుల్ బ్రాన్ ఆయిల్స్ లిమిటెడ్ సంస్థలు సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందించి దాతృత్వం చాటుకున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి చెక్కులు అందించారు.
సీఎం సహాయనిధికి విరాళాలు