నల్గొండలో ప్రైవేటు బస్సుకు మంటలు.. పూర్తిగా దగ్ధం - private bus caught fire at nalgonda town
నల్గొండ పట్టణ శివారులోని చర్లపల్లి వద్ద ఓ ప్రైవేటు బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 40 మంది ప్రయాణికులు క్షేమంగా రక్షించగలిగారు.
హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా కేంద్రం శివారులోని చర్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని గాయత్రి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ39ఎక్స్ 3654 నంబరు గల బస్సు ఇంజిన్‌లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వాహనంలో 40 మంది ప్రయాణిస్తున్నారు. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై అందరిని దించేశాడు. అనంతరం క్షణాల్లోనే బస్సు కాలి బూడిదైపోయింది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.