అనంతపురం నుంచి చిలకలూరిపేట బైపాస్ వరకు నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చేర్చింది. దీనివల్ల ఈ ప్రాజెక్డు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.
మొదట అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కలిసేలా 384 కి.మీ మేర ఈ రహదారిని నిర్మించాలనుకున్నారు. ఇప్పుడు చిలకలూరిపేట బైపాస్‌లో కలపడంతో 50 కి.మీ తగ్గుతోంది.
మొత్తం 19 ప్యాకేజీలుగా దీనిని నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా పరిధిలో అలైన్మెంట్ మారడంతో ఇక్కడి ప్యాకేజీల సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల్లో మార్పులు చేస్తున్నారు. మరోవైపు భూసేకరణ కూడా వేగవంతం చేయనున్నారు.