రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక నిల్వలు పెంచేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేది జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి ఇసుక నిల్వలు, పంపిణీ అంశాలపై జాయింట్ కలెక్టర్లు, జిల్లా సాండ్, మైనింగ్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఇసుక బుక్ చేసుకున్న వారికి సకాలంలో పంపిణీ జరగాలని ద్వివేదీ స్పష్టం చేశారు. ఇసుక పంపిణీ పెంచడంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.నాడు- నేడు కార్యక్రమం, ఉపాధి హామీ పథకంలో ఇసుక కొరత లేకుండా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.