తెలంగాణలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు. ఈ వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించి రుచి చూశారు. ఏమేం వడ్డిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు.
శనివారం యాదమ్మ బృందం నోవాటెల్‌కు చేరుకున్నప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రధాని మోదీ మూడుసార్లు డైనింగ్హాల్ను సందర్శించి.. కొన్ని వంటలు రుచి చూశారని.. మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. భాజపా కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన దాదాపు 1,500 మందికి గత మూడు రోజులుగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వంటకాలను వడ్డిస్తున్నట్లు తెలిపారు.