తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కేంద్రం ధర్మకంచకు చెందిన లక్కపల్లి భాస్కర్... కుమారుడు గగన్హర్షకు పై పన్ను వచ్చింది. ఇలా వచ్చినందుకు గానూ... శాంతిపూజ చేయాలని పలువురు భాస్కర్‌కు సూచించారు. పూజ కోసం గణేశ్వాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలోని పూజారిని భాస్కర్ సంప్రదించాడు.
'మీకు గుడిలోకి ప్రవేశంలేదు.. మీకోసం పూజలు చేయను'
ఆధునిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత కాలంలోనూ... కులాల వారిగా నిబంధనలు పెడుతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో సైతం... కొన్ని కులాల వారిని ఆలయాల్లో ప్రవేశించరాదని ఆపేస్తున్నారు. ఫలానా కులం వారికి దేవాలయాల్లో పూజలు చేయమని నిరాకరిస్తూ... వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఈ అమానవీయ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో చోటుచేసుకుంది.
ఈ క్రమంలో సదరు పూజారి... తన కులం ఏంటని భాస్కర్‌ను ప్రశ్నించాడు. తాము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్లమని చెప్పగా... ఎస్సీలకు గుడిలోకి ప్రవేశం లేదని పూజారి గద్దించాడు. ఎస్సీలకు ఈ గుడిలో పూజలు చేయమని నిరాకరించాడు. పూజారి ప్రవర్తనతో భాస్కర్ కుటుంబసభ్యులు తీవ్ర మనస్తాపం చెంది... దేవాలయం ముందు నిరసన చేపట్టారు.
బాధితులకు దళిత సంఘాలు మద్దతు పలికారు. సదరు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ వినోద్ కుమార్, సీఐ మల్లేశ్ కేసు నమోదు చేసి పూజారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.