ETV Bharat / city
కలానికి కళ్లెం వేసే జీవోపై ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు - pci responds on go 2430
కలానికి కళ్లెం వేసే జీవో 2430ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. జీవోపై వివరణ ఇవ్వాలని సీఎస్, సమాచారశాఖ ముఖ్య కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.
జీవో 2430 పై వివరణ కోరిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
By
Published : Nov 2, 2019, 5:16 PM IST
| Updated : Nov 3, 2019, 7:42 AM IST
కలానికి కళ్లెం వేసే జీవోపై ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు కలానికి కళ్లెం వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్.... జీవోపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీచేసిన 2వేల 430 జీవో.... జర్నలిస్టుల విధి నిర్వహణకు భంగకరంగా ఉందని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని... పీసీఐ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛకు ఇది పెనుభారంగా ఉందని వ్యాఖ్యానించారు. తప్పుడు, నిరాధార, పరువుకు భంగం కలిగించే వార్తలు ప్రచురిస్తే... వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖల కార్యదర్శులకు అనుమతిస్తూ అక్టోబర్ 30న ఈ జీవో జారీ చేశారు. Last Updated : Nov 3, 2019, 7:42 AM IST