president winter sojourn: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దక్షిణాది విడిది పర్యటన రద్దు అయింది. శీతాకాల విడిది కోసం ఈనెల 29న హైదరాబాద్ వస్తారని, వచ్చే నెల మూడో తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తారని కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దక్షిణాది విడిది పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన రద్దైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
president winter sojourn: రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన రద్దు - రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన రద్దు
రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన రద్దు అయింది. ఈనెల 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ రావాల్సి ఉండేది. కొవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన రద్దైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
president
Last Updated : Dec 27, 2021, 2:53 AM IST