శ్రీరామచంద్ర మిషన్ వ్యక్తిగత మార్పునే కాదు సమాజంలోనూ మార్పు తీసుకొస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని.. రంగారెడ్డి జిల్లా కన్హాలో ఏర్పాటు చేసిన కన్హా శాంతివనాన్ని ప్రారంభించారు. రామచంద్ర మిషన్ 75వ వసంతంలో అడుగుపెట్టిన రోజే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవింద్ అన్నారు.
ఆధ్యాత్మిక బాట ఆనందం
ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రంగా పేరొందిన ఈ కేంద్రంలో లక్షల మంది అభ్యసిస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. రామచంద్ర మిషన్‌కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండటం ఆనందంగా ఉందన్నారు. బుద్ధ, మహావీర్, నానక్, కబీర్, వివేకానంద వంటి ఆధ్యాత్మిక ప్రతినిధులు చూపిన బాటలో నేటి తరం నడవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.