రాష్ట్రంలో 2.29 లక్షల మంది లబ్ధిదారులతో వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రాథమిక జాబితా ఖరారైంది. అందరికీ ఈ నెలలోనే ఆర్థికసాయం అందించనున్నారు. వైఎస్సార్ నవశకం సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఐదేళ్లల్లో 75వేల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది. జాబితాలో తమ పేర్లు లేవని లబ్ధిదారులుగా గుర్తించాలంటూ 7,796 మంది చేసిన విజ్ఞప్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పథకం ద్వారా 6లక్షల మంది మహిళలకు ఏటా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక జాబితాలో లేనివారి నుంచి బుధవారం వరకూ అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
2.29 లక్షల మందికి వైఎస్ఆర్ కాపు నేస్తం
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అర్హుల ప్రాథమిక జాబితా ఖరారైంది. 2 లక్షల 29 వేల మందికి పథకం వర్తింపజేయనున్నారు. లబ్ధిదారులందరికీ ఈ నెలలోనే ఆర్థిక సాయం అందించనున్నారు. బుధవారం వరకూ అభ్యంతరాలను స్వీకరించనున్నారు అధికారులు.
kapu nestam