బడ్జెట్ రూపకల్పనకు సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రీబడ్జెట్ సమావేశం జరిగింది. ఏటా బడ్జెట్లో ఆయాశాఖలకు చెందిన ప్రతిపాదనల్ని నమోదు చేసేందుకు ఈ మీటింగ్ నిర్వహించారు. ఆర్థిక శాఖ కార్యదర్శులు గుల్జార్, కార్తికేయ మిశ్ర, కేవీవీ. సత్యనారాయణ, ఇతర విభాగాలకు చెందిన కార్యదర్శుల నుంచి ప్రతిపాదనల్ని స్వీకరించారు. పోలీసు, అగ్నిమాపక, జైళ్ల విభాగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా తమ శాఖలకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనల్ని సమర్పించారు. సమావేశం అనంతరం ఆయా శాఖల మంత్రులను ఆర్థిక మంత్రి బుగ్గన మరోమారు కలవనున్నారు.
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో ప్రీబడ్జెట్ సమావేశం - pre budget meeting in secretariat news
బడ్జెట్ అంచనాల రూపకల్పన కోసం ఆర్థిక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సచివాలయంలో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు.
సచివాలయంలో ప్రీబడ్జెట్ సమావేశం