ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు - ap news

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలో ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడుతున్నామన్నారు.

prc protest in ap
prc protest in ap

By

Published : Jan 28, 2022, 5:01 PM IST

పీ.ఆర్.సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద రెండో రోజు దీక్షలను ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలని, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, పాత జీతాలు ఇవ్వాలన్న తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్యలకు వెళతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.

పీఆర్సీ ప్రకటించే వరకు పోరాటం ఆగదు..

పీఆర్సీ చీకటి జీఓలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్సీ సాధన సమితి విశాఖలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసే విధంగా పీఆర్సీ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం వేసే కమిటీ.. ఉద్యోగుల మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై దృష్టిసారించి ఉద్యోగ సంఘాలకు అనువైన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు జీవీఎంసీ గాంధీ పార్క్​లో దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సజ్జలకు పీఆర్సీ గురించి ఏం తెలుసు?

జగన్​కి బదులు సజ్జల రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని.. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి కాదని, ముఖ్యమంత్రి అని ఆయన స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి పీఆర్సీ గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సమ్మె వరకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో కూర్చోకుండా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై దృష్టి పెట్టాలని కోరారు.

ఇదీ చదవండి:APSRTC: సమ్మెకు సిద్ధం.. ఏ క్షణమైనా బస్సులు ఆపుతాం: ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details