తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో శవం వద్ద పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. టీఆర్నగర్లో రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మంత్రాలు చేసి చంపాడని పుల్లయ్య అనే వ్యక్తిని మృతుడి కుటుంబ సభ్యులు చితకబాదారు. తానే మంత్రాలతో చంపానని, మళ్లీ బతికిస్తానని పుల్లయ్య అంగీకరించాడు. మృతదేహం వద్ద కొన్ని గంటలపాటు పూజలు చేశాడు.
ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు చేరింది. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. పుల్లయ్యను పోలీసులు తీసుకెళ్లటంతో మృతుని బంధువుల ధర్నాకు దిగారు. దీంతో కరీంనగర్ - జగిత్యాల రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.