ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి జగన్ గ్రహణం పట్టకూడదు' - అమరావతిపై ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు

మూడు రాజధానుల ప్రకటనపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని...  మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. కేబినెట్ సమావేశంలో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం ఉంటే డిసెంబర్ 28న రాష్ట్ర బంద్​కి పిలుపునిస్తామన్నారు.

prattipati pullarao on amaravathi
ప్రత్తిపాటి పుల్లారావు

By

Published : Dec 26, 2019, 4:48 PM IST

మూడు రాజధానుల ప్రకటనపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని... మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలనీ.. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల తరఫున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తామని హెచ్చరించారు. అమరావతిలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. కేబినెట్ సమావేశంలో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం ఉంటే డిసెంబర్ 28న రాష్ట్ర బంద్​కి పిలుపునిస్తామన్నారు.

కావాలనే దాడులు
ప్రభుత్వం కావాలనే అధికారుల్లో... ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకొని దాడులు చేస్తోందని... పుల్లారావు ఆరోపించారు. ఐఆర్​ఎస్ అధికారి జాస్తి కృష్ కిషోర్‌ సస్పెన్షన్‌ విషయమే ఇందుకు ఉదాహరణ అని విమర్శించారు. క్యాట్‌ చేసిన వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహించి... ముఖ్యమంత్రి పదవికి జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్తిపాటి పుల్లారావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details