Pranahita Pushkaralu: తెలంగాణలో త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కర వేడుక ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తజనం.. నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లన్నీ బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో గుంటూరు, రాజమండ్రి నుంచి అధికంగా తరలివచ్చారు. ఇప్పటివరకూ ప్రతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ వస్తున్నామని భక్తులు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 12 రోజుల పాటు(ఏప్రిల్ 24 వరకు) ప్రాణహిత పుష్కరాలు కొనసాగనున్నాయి.
Pranahita Pushkaralu: ప్రశాంతంగా "ప్రాణహిత పుష్కర" వేడుక.. తరలివస్తున్న భక్తజనం!
Pranahita Pushkaralu: తెలంగాణలో ప్రాణహిత పుష్కరాల వేళ నదీతీరాన ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయాల్లో వేద మంత్రాలు, నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానాలతో పుష్కర వేడుక వైభవోపేతంగా సాగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
ప్రశాంతంగా "ప్రాణహిత పుష్కర" వేడుక.. తరలివస్తున్న భక్తజనం!