రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా సీపీడబ్ల్యూడీ మాజీడైరెక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్‌ను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దిల్లీలోని కేంద్ర ప్రజా పనుల విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ప్రభాకర్ సింగ్‌ను సాంకేతిక సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనా విభాగం ముఖ్యక్యార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి, నిర్మాణ ప్రణాళికలకు సంబంధించి ప్రభాకర్ సింగ్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.