Spinning Industries: పత్తి ఆధారిత నూలు మిల్లులకు రాష్ట్రం పెట్టింది పేరు. రాష్ట్రవ్యాప్తంగా 128 స్పిన్నింగ్ మిల్లులుండంగా..వార్షిక టర్నోవర్ 13వేల కోట్లు. ఉత్పత్తి చేసే నిల్వల్లో 50 శాతానికిపైగా ఎగుమతి వాటా ఉంది. అందులోనూ 80 శాతం చైనాకే ఎగుమయ్యేవి. ఇప్పుడు చైనాకు భారీగా ఎగుమతులు నిలిచిపోవడం వల్ల స్పిన్నింగ్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముడిపత్తి ధర 6 వేల నుంచి 12 వేలకు పెరగ్గా.. దూది క్యాండిల్ ధర 50వేల నుంచి లక్ష రూపాయలకు చేరింది. ఇలా స్పిన్నింగ్ మిల్లులపై ఆర్థికభారం ఉండగా ప్రభుత్వ పవర్ హాలీడే నిర్ణయంతో పెద్ద పిడుగే పడింది. ఉత్పత్తి దాదాపు సగానికి పడిపోయింది.
విద్యుత్తు కోతలు వేధిస్తున్నా జనరేటర్లు వినియోగించేందుకూ పరిశ్రమల యజమానులు సాహసించడంలేదు. రెండు, మూణ్నెళ్లలో కోతలు మరింత ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
" పవర్ హాలిడేకు ఎవరూ సిద్ధంగా లేరు. గత 15 సంవత్సరాల నుంచి ఇంత వరకు పవర్ కట్లు చూడలేదు. 1984-85లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మనం పవర్లో ఇప్రూ అవుతూ వచ్చాం. దాని వల్ల పరిశ్రమలు బాగానే నడిచాయి. ఏ పరిశ్రమ కూడా జనరేటర్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. జనరేటర్లు ఒక్క లైటింగ్ కోసమే పెట్టుకుంటారు. పవర్ కట్ వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రాబోమో రెండు మూడు నెలల్లో ఇంకా ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం కన్పిస్తోంది."- మనోహర్, స్పిన్నింగ్ పరిశ్రమ నిర్వాహకుడు