ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

power employees jac: ప్రభుత్వం పట్టించుకోకపోతే సమ్మెకు దిగుతాం: విద్యుత్ ఉద్యోగుల ఐకాసా - రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య వేదిక

ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నెల్లూరు జరిగిన విద్యుత్ ఉద్యోగుల సదస్సులో రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

power employees jac warn to ap govt
power employees jac warn to ap govt

By

Published : Feb 13, 2022, 10:14 AM IST

విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే.. సమ్మెకు దిగుతామని రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య వేదిక హెచ్చరించింది. నెల్లూరులో జరిగిన విద్యుత్‌ ఉద్యోగుల సదస్సులో.. రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం రెండేళ్లుగా యాజమాన్యానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకోకుండా విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. డిమాండ్ల సాధన కోసం గత నెల 28న యాజమాన్యానికి నోటీసు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవకుండా నిర్లక్ల్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు రెగ్యులరైజేషన్‌ పేరుతో ఉద్యోగులను విభజించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details