POWER SHORTAGE: రాష్ట్రంలో ఆగస్టు నుంచి విద్యుత్ కొరత ఏర్పడే ఆస్కారం ఉందని రియల్ టైం సాంకేతికత ఆధారంగా విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చే విద్యుత్ పోనూ తీవ్ర డిమాండ్ సమయంలో (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటలు) సుమారు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడనుందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) నివేదిక ఇచ్చింది. ఈ లోటును అధిగమించడానికి విద్యుదుత్పత్తి సంస్థలతో స్వల్పకాలిక ఒప్పందాలను (పీపీఏ) కుదుర్చుకోవాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. పీక్ డిమాండ్ సమయంలోని టైం బ్లాక్‌లలో (ఒక్కో టైం బ్లాక్ 15 నిమిషాలు) సరఫరా చేయడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నాయి. లేదంటే స్వాపింగ్ విధానాన్ని (మనకు అవసరమైనప్పుడు తీసుకున్న విద్యుత్‌ను.. అదనంగా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు సర్దుబాటు చేయడం) పరిశీలిస్తున్నాయి. తదనుగుణంగా రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీకి ప్రతిపాదన పంపనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఖరీఫ్ పంటలకు కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు నెలాఖరు నుంచి బోర్ల ద్వారా నీరివ్వాల్సి ఉంటుంది. రబీ సీజన్‌లోనూ వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
కృష్ణపట్నంలో ఒక యూనిట్ అందుబాటులోకి..