పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రైబ్యునల్ స్టే - undefined
17:47 May 20
పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రైబ్యునల్ స్టే
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విస్తరణకు బ్రేక్ పడింది. పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వర ఎత్తిపోతలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. ప్రాజెక్టు అధ్యయనానికి నాలుగు శాఖల సమన్వయంతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది.
పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన సర్పంచుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేశారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణలో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ తెలిపారు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో బెంచ్ విచారించి విస్తరణ పనులపై స్టే విధించనట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారన్నారు.
TAGGED:
pothireddypadu