ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

14,037 పోస్టులు భర్తీ చేయండి: వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు - ఏపీ తాజా వార్తలు

ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులు.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆసుపత్రుల్లోని పడకల సంఖ్య, ఐపీ, ఓపీ, వైద్య ప్రమాణాల మేరకు రాష్ట్రంలో 14,037 పోస్టులు భర్తీ చేయాలని వారు గుర్తించారు.

posts in health department
posts in health department

By

Published : Sep 22, 2021, 8:24 AM IST

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న, కొత్తగా మంజూరు చేయాల్సిన పోస్టులపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజారోగ్య శాఖ, వైద్య విద్య, వైద్య విధాన పరిషత్‌ అధికారులు కొద్ది రోజులుగా చర్చిస్తున్న మేరకు.. ఆసుపత్రుల్లోని పడకల సంఖ్య, ఐపీ, ఓపీ, వైద్య ప్రమాణాల మేరకు రాష్ట్రంలో 14,037 పోస్టులు భర్తీ చేయాలని గుర్తించారు. ఈ పోస్టుల భర్తీచేస్తే రాష్ట్ర ఖజానాపై వేతనాల రూపంలో ఏటా రూ.676.83 కోట్ల భారం పడుతుంది. ప్రతిపాదిత 14,037 ఉద్యోగాల్లో.. 5,276 పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మిగిలినవి కొత్తగా మంజూరు చేయాల్సినవి. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే అక్టోబరు 1 నుంచి నియామకాల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. రెగ్యులర్‌, ఒప్పంద, పొరుగు సేవల కింద ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

*ప్రజారోగ్య శాఖ పరిధిలో మంజూరైన పోస్టుల్లో ప్రస్తుతం 451 ఖాళీగా ఉన్నాయి. ఇదే విభాగంలో కొత్తగా 176 పీహెచ్‌సీలు రాబోతున్నాయి. వీటి నిర్వహణకు వైద్యులు, ఇతర సిబ్బంది కలిపి 2,464 మంది ఉద్యోగులు అవసరం.
* వైద్యవిద్య కింద బోధనాసుపత్రుల్లో 1,952 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా మరో 2,190 ఉద్యోగాలు నింపాలని గుర్తించారు. ప్రాథమిక సమాచారం మేరకు 282 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించాల్సి ఉంది. జిల్లా కమిటీల ద్వారా 430 స్టాఫ్‌ నర్సు, పారా మెడికల్‌ విభాగంలో 1,240 పోస్టులు భర్తీ చేస్తారు. పీజీ సీట్ల పెంపు, వైద్య సేవల విస్తరణకు వీలుగా 51 ప్రొఫెసర్లు, 187 అసోసియేట్‌, 130 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించారు.
* వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో కలిపి 5,695 పోస్టులు నింపాలి. ఇందులో మంజూరై ఖాళీగా ఉన్నవి 2,873. మిగిలినవి కొత్తగా ప్రతిపాదించినవి. ఈ విభాగంలో మంజూరై భర్తీకాని వైద్యుల ఖాళీలు 1,252 ఉండగా, కొత్తగా 193 పోస్టులు అడిగారు. ఇక, నర్సింగ్‌ 886, పారా మెడికల్‌ క్లాస్‌-4లో 738, ఫార్మసీ 280 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని అధికారులు ప్రతిపాదించారు.

ఇదీ చదవండి:కొప్పర్రు ఘటన... మాజీ జడ్పీటీసీ కుటుంబానికి తెదేపా పరామర్శ

ABOUT THE AUTHOR

...view details