ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AIDED-HC : 'ఎయిడెడ్'​కు ఆర్థిక సాయం నిలిపివేయడంపై విచారణ వాయిదా - aided schools

ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యాజ్యాలను పాఠశాల విద్య, ఉన్నత విద్యగా వర్గీకరించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచించింది. వివరాలు సమర్పించాలని విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశించింది.

విచారణ వాయిదా
విచారణ వాయిదా

By

Published : Jan 6, 2022, 5:52 AM IST

ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను పాఠశాల విద్య, ఉన్నత విద్యగా వర్గీకరించాలని హైకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించాలని విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ను కోరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై తుది విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదా తమకు అప్పగించాలని సూచిస్తూ ఏపీ విద్యా చట్టాన్ని సవరించింది. ఈ క్రమంలో ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై యాజమాన్యాల సమ్మతి తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ జీవోలు జారీ చేసింది. అయితే, ఈ ఆర్డినెన్స్‌, జీవోలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పాఠశాలలకు ఎయిడ్‌ నిలిపివేయడం విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన వ్యాజ్యాలుగా విభజించి విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వ్యాజ్యాలు వర్గీకరించి.. కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం కావాలని కోరారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details