ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు లేవా...?: హైకోర్టు - ap highcourt news

వాక్‌ స్వాతంత్ర్యానికి పరిమితుల్లేవా అని.. హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఈసీ పైమంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాజ్యాల్ని ప్రస్తావించింది. వాక్ స్వాతంత్ర్య స్వేచ్ఛకు ఆరంభం, అంతం ఎక్కడో తేలుస్తామని.. వ్యాఖ్యానించింది. కొడాలి నాని వ్యాఖ్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Kodali Nani's petition
కొడాలి నాని పిటిషన్​పై హైకోర్టులో విచారణ

By

Published : Feb 15, 2021, 4:38 PM IST

Updated : Feb 16, 2021, 6:09 AM IST

అసభ్య పదజాలంతో దూషించినందుకు ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానంలో ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. ఎన్నికల కోడ్ అమల్లో లేనప్పుడు ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎస్ఈసీ స్పందించలేదని,,.. ఇపుడు ఎన్నికల సమయంలో రాజ్యాంగ సంస్థపై దూషణలతో దాడి చేస్తున్నారని... ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశోక్ కుమార్ ఆక్షేపించారు. ఇలాంటి దాడికి అడ్డుకట్టవేయకపోతే హద్దుండదని, వ్యవస్థల ప్రతిష్ఠ దిగజారతుందని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎమ్మెల్యే జోగి రమేశ్, ఇప్పుడు కొడాలి నాని ఎస్ఈసీ ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారన్నారు. కమిషన్‌ పవిత్రతను కాపాడే ఉద్దేశంతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మీడియాలో మాట్లాడకుండా నిలువరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొడాలి వ్యాఖ్యల వీడియోతోపాటు మీడియాలో ప్రసారమైన వీడియోలను కోర్టు ముందుంచారు. వాటిని న్యాయమూర్తి క్షుణ్ణంగా చూశారు.

మరోవైపు కొడాలి నాని వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి తరపు న్యాయవాది ఆరోపించారు. దేని ఆధారంగా చర్యలు తీసుకున్నారో ఆ వివరాల్ని పిటిషనర్‌కు ఇవ్వలేదన్నారు. కోర్టు ముందు ఉంచిన వీడియో క్లిప్పింగ్ లన్ని మంత్రి ఈనెల 12 న మీడియా సమావేశంలో మాట్లాడినవి కావన్నారు. ఐతే అసలైన వీడియో పుటేజ్ ను మీరెందుకు సమర్పించలేదని కొడాలి నాని న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నంచింది. ఇరువర్గాలు కోర్టు ముందుంచిన వివరాలు సంతృప్తికరంగా లేవన్న ధర్మాసనం ఎస్ఈసీ పై వ్యాఖ్యలకు సంబంధించి వారం వ్యవధిలో మూడు వ్యాజ్యాలు తమ దృష్టికి వచ్చాయని గుర్తుచేసింది. వాక్ స్వాతంత్ర్యానికి పరిమితులు లేవా అని ప్రశ్నించిన హైకోర్టు వాక్ స్వాతంత్ర్య స్వేచ్ఛ ఎక్కడ ఆరంభం అవుతుంది, ఎక్కడ అంతం అవుతుందో తేలుస్తామనవ్నారు. వీడియోలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు సీనియర్ న్యాయవాది రఘురాంను అమికస్ క్యూరీగా నియమించింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Last Updated : Feb 16, 2021, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details