ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు.. సబ్ కలెక్టర్లుగా ఆరుగురు! - postings to ias officers
ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు, పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్... ఆర్టీజీఎస్ కార్యదర్శి, ఐటీ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐటీ కార్యదర్శి బాధ్యతల నుంచి అనూప్ సింగ్‌ను రిలీవ్ చేసిన ప్రభుత్వం... సీసీఎల్ఏ షెడ్యూల్డ్ ఏరియా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వెట్రిసెల్విని నియమించింది. మరోవైపు.. శిక్షణ పూర్తిచేసుకున్న 2017 బ్యాచ్ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆరుగురు అధికారులకు సబ్ కలెక్టర్లుగా నియమించింది. విజయవాడ సబ్ కలెక్టర్‌గా హెచ్.ఎమ్.ధ్యానచంద్ర... గూడూరు సబ్ కలెక్టర్‌గా రోనంకి గోపాలకృష్ణ.. నరసాపురం సబ్ కలెక్టర్‌గా కె.ఎస్.విశ్వనాథన్.. రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్య.. పెనుకొండ సబ్ కలెక్టర్‌గా టి.నిశాంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.