Postings and transfers: ఏపీలో కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత, గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జేసీగా నవీన్, పార్వతీపురం ఐటీడీఏ పీఓగా విష్ణుచరణ్‌లను నియమించింది. మిడ్ డే మీల్స్ డైరెక్టర్‌గా నిధి మీన, ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలంను నియమించింది.
ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ఏపీ తాజా వార్తలు
Postings and transfers: రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌లకు ప్రభుత్వం... పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొంత మందిని బదిలీ చేసింది. ఎవరెవరిని ఎక్కడ నియమించిందంటే..?
2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సాల్, నరసాపురం సబ్ కలెక్టర్‌గా సూర్య తేజ, టెక్కలి సబ్ కలెక్టర్‌గా రాహుల్ కుమార్‌రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూర్ కౌమర్, ఆదోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్‌గా అదితి సింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తిక్, గూడూరు సబ్ కలెక్టర్‌గా శోభికా, కందూకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్, పార్వతీపురం ఆర్డీవోగా హేమలతలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: