జనాభా కంటే ఓటర్లు తక్కువగా ఉండటం సహజం. కాని, విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట పంచాయతీలో జనాభా, ఓటర్లు సమాన సంఖ్యలో ఉండటం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పంచాయతీ జనాభా 5076 కాగా, 2019 ఓటరు జాబితాను అనుసరించి ఓటర్లు కూడా 5076.
ఎన్నికల సంఘం అంచనాల మేరకు జనాభాలో 70 శాతానికి లోబడి ఓటర్లు ఉంటారు. 2011 జనగణన తర్వాత రాజయ్యపేట ప్రాంతానికి వలసలు పెరగడం, కొత్తగా వచ్చిన వారు ఓటు హక్కు పొందడంతో యాదృశ్చికంగా రెండు అంకెలూ సరి సమానమయ్యాయి.