గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను జగన్ లాక్కొని ఇళ్లస్థలాల పేరిట తిరిగి వాళ్లకే పంచుతున్నారని తెదేపా నేత లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇది జగన్ రివర్స్ టెండరింగ్‌కు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. పథకాల మార్పుకోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. జగన్ అక్రమంగా సంపాదించిన వేల ఎకరాల ఎస్టేట్లు, ప్యాలెస్‌లు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. తద్వారా లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు వస్తాయన్నారు.
'పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారు' - లోకేశ్ ట్వీటర్ వ్యాఖ్యలు
జగన్ పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారని తెదేపా నేత లోకేశ్ మండిపడ్డారు. ఇది జగన్ రివర్స్ టెండరింగ్‌కు పరాకాష్ట అని ఆయన ఎద్దేవా చేశారు.
!['పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారు' ట్వీటర్లో లోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6195596-811-6195596-1582616793261.jpg)
ట్వీటర్లో లోకేశ్
Last Updated : Feb 25, 2020, 5:25 PM IST