హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా గడుపుతున్నారు. శిల్పారామంలోని ప్రకృతి అందాలను, పల్లె వాతావరణం ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దిన గ్రామీణ మ్యూజియంలో అందాలను ఆస్వాదిస్తున్నారు.
గంగిరెద్దుల విన్యాసాలు, పిట్టలదొర మాటల తూటలు, హరిదాసులు కథలు, బుడ్డ జంగమల ఆటపాటలు, ఎద్దుల బండి సరదాలు, బోటు షికారులతో ప్రజలందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.