ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TG Polycet 2021: తెలంగాణ పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల - polytechnic 2021 results

తెలంగాణలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం  విడుదల చేసింది.

polycet-2021
polycet-2021

By

Published : Jul 28, 2021, 2:31 PM IST

తెలంగాణలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. polycetts.nic.in,sbtet.telangana.gov.in,www.dtets.cgg.gov.in లో పాలిసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, పాలిసెట్ బైపీసీ విభాగంలో 76.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 92,557 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

షెడ్యూల్ ఖరారు...

ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుంది. నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి.

కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌..

ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ నిర్వహిస్తారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23న తుది విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 1న నుంచి పాలిటెక్నిక్‌ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. సెప్టెంబరు 9న స్పాట్ ప్రవేశాలకుగాను మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:

Tdp leaders serious on Govt: 'వైకాపా దోపిడీని అడ్డుకుంటే.. దాడులు చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details