ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యం... కట్టడికి అధ్యయనం - హైదరాబాద్​ కాలుష్యం వార్తలు

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించే విషయమై అధ్యయనం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాలుష్య కారకాలపై ఏదేని ఒక ప్రముఖ ఐఐటీ సంస్థతో అధ్యయనం చేయించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం విడుదల చేసిన రూ.117 కోట్లతో కాలుష్య కట్టడికి కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

polution
polution

By

Published : Nov 5, 2020, 3:21 PM IST

హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత ప్రమాదకర దిశగా వెళ్తోన్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం గాలి నాణ్యత సూచిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించింది. కాలుష్య కారకాలపై ఏదేని ఒక ప్రముఖ ఐఐటీ సంస్థతో అధ్యయనం చేయించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం విడుదల చేసిన రూ.117 కోట్లతో కాలుష్య కట్టడికి కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు పటాన్‌చెరు, నల్గొండలో వాయుకాలుష్యం అధికంగా ఉంది.

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించే విషయమై అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ ముంబయి, ఐఐటీ దిల్లీ, ‘నీరి’ నాగ్‌పూర్‌, టాటా ఎనర్జీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లాంటి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. ఎంపిక చేసిన ఒక సంస్థకు బాధ్యతలను అప్పగించనున్నారు.

గాలినాణ్యత సూచిలో 0-50 పాయింట్లు ఉంటే అది మంచి గాలి. 51-100 పాయింట్లు ఆరోగ్యపరంగా సున్నితంగా ఉండేవారిపై, 101-200 ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిపై ప్రభావం చూపుతుంది. 200 పాయింట్లు దాటితే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. హైదరాబాద్‌లో గాలి నాణ్యత సూచి 167 పాయింట్లుగా నమోదవుతోంది. కేంద్రం ఇచ్చిన నిధులతో కొత్తగా ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లను నెలకొల్పుతారు. రోడ్లపై చెత్త ఊడ్చే యంత్రాలు కొంటారు. వాహనాలకు బీఎస్‌-6 నిబంధనల్ని అమలుచేస్తారు.

గాలి నాణ్యత పెంచుతాం

కాలుష్యాన్ని నియంత్రించాలంటే.. ఉద్గారాలు ఏవి, ఎక్కడి నుంచి ఎంత మోతాదులో వస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యమని పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్​కుమార్​ తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేయిస్తామన్నారు. నివేదిక ఆధారంగా గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి:నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం

ABOUT THE AUTHOR

...view details