ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లె పోరు: బరిలో అక్కాచెల్లెలు..నేనున్నానంటూ బంధువు

పంచాయతీ ఎన్నికలో ఓ వైపు అక్క.. మరోపక్క చెల్లెలు.. ఇదిలా ఉంటే సీన్​లోకి బంధువు ఎంట్రీ...ఇంకేముంది పల్లె పోరు కాస్త... ఫ్యామిలీ ఫైట్​గా మారిపోయింది. అక్కకు అండగా తెదేపా...చెల్లికి మద్దతుగా వైకాపా నిలిచాయి. వీరిద్దరి బంధువువైన మరో వ్యక్తికి జనసేన జై కొట్టడంతో...ఈ పల్లె పోరు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. మరోవైపు వీరి బంధుగణం ఎవరికి మద్దతు ప్రకటించాలో తెలియక డైలామాలో పడిపోతున్నారు.

ap local polls 2021
ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021

By

Published : Feb 7, 2021, 1:35 PM IST

Updated : Feb 7, 2021, 1:58 PM IST

బంధాలు.. అనుబంధాలకతీతంగా పల్లె పోరు సాగుతోంది. స్వయంగా అక్కాచెల్లెలు హోరాహోరీగా తలపడుతుండగా.. నేనున్నానంటూ మరో బంధువు రంగంలోకి దిగడం విశేషం. వీరికి ప్రధాన పార్టీలు మద్దతు తెలుపుతుండడం ఆసక్తి రేపుతోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్​కు ప్రకాశం జిల్లాలోని కుంకలమర్రు పంచాయతీ వేదికైంది.

ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రుకు చెందిన ఈదర రాజకుమారి, ఈదర సౌందర్య అక్కాచెల్లెలు. ఇద్దరికీ గ్రామంలోని దగ్గరి బంధువులతో వివాహం జరిగింది. మొన్నటి వరకూ ఆ రెండు కుటుంబాలూ ఒకే పార్టీలో ఉన్నాయి. సర్పంచి పదవిని ఇద్దరూ ఆశించి చెరో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఈదర రాజకుమారి తెదేపా, చెల్లెలు సౌందర్య వైకాపా మద్దతుతో సర్పంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరి బంధువు ఈదర చంద్రిక జనసేన తరఫున సవాల్‌ విసురుతున్నారు. పార్టీరహితమైనా తమ వారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీల శ్రేణులు రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తున్నాయి.

ముగ్గురూ తెలిసిన వారే కావడంతో ఎవరికి మద్దతు పలకాలో తెలియక బంధువులు ఇబ్బంది పడుతున్నారు. ఓటు అభ్యర్థించేందుకు వస్తున్న ముగ్గురికీ బంధువులు భరోసా ఇస్తుండడంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి

ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు..

Last Updated : Feb 7, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details