ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీకి రాజకీయ కారణాలు అడ్డొస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 25 వరకు రాజకీయ కారణాలతో 34,395 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదని అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 14,827 మందికి ఈ కారణాలతోనే పట్టాల పంపిణీ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 9,311, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,112, గుంటూరు జిల్లాలో 2,324, కడప జిల్లాలో 1,821 మందికి చొప్పున పట్టాల పంపిణీకి రాజకీయ కారణాలు అడ్డుగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ పేర్కొంది.
అయితే ప్రజాప్రతినిధులు తామే పట్టాలు పంపిణీ చేస్తామనడంతో ఆయా ప్రాంతాల్లో పట్టాల పంపిణీ జరగలేదు. అనువుకానిచోట్ల పట్టాలు ఇవ్వడంతో 5,115 మంది తిరస్కరించారని తెలిపింది. కాకినాడ గ్రామీణ మండలం నేమాంలో లోతట్టు ప్రాంతంలో స్థలాలిస్తామన్నారని, తుని ప్రజలకు పట్టణానికి ఆరు కి.మీ.దూరంలో స్థలాలిస్తామన్నారని అక్కడివారు పట్టాలు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు.
టిడ్కో ఇళ్ల పంపిణీలో..