తెలంగాణలో ఉదయం 7 గంటలకు పురపాలక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తొమ్మిది కార్పొరేషన్లలో 324 డివిజన్లకు, 120 మున్సిపాలిటీల్లో 2,647 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది.
9 కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు తమ భవితవ్యంను పరీక్షించుకుంటున్నారు. 50 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 120 మున్సిపాల్టీల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు, కార్పొరేషన్లలో 1,773 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.