తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల ఆలయ రథం దగ్ధమైనప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలిపేందుకు వస్తున్న వారిని నియంత్రించే క్రమంలో తనతో పాటు అదనపు ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి, 10 మంది పోలీసు సిబ్బంది వైరస్ బారినపడ్డట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం వెల్లడించారు. తామంతా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని, చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 850 మంది పోలీసులకు వైరస్ సోకినట్లు తెలిపారు.
'అంతర్వేది' విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. తనతో పాటు అదనపు ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి, 10 మంది పోలీసు సిబ్బంది వైరస్ బారినపడ్డట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం వెల్లడించారు.
police