ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మందడం పాఠశాలలో పోలీసుల విశ్రాంతి.. తల్లిదండ్రుల ఆగ్రహం - మందడంలో పాఠశాలలో పోలీసుల విశ్రాంతి

మందడంలో పాఠశాల తరగతి గదుల్ని పోలీసులు విశ్రాంతి తీసుకోడానికి ఉపయోగించటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు వారితో వాగ్వాదానికి దిగారు. పిల్లల్ని బయటకు పంపి లోపల విశ్రాంతి ఎలా తీసుకుంటారంటూ నిలదీశారు.

police use school rooms for rest in mandadam
మందడం పాఠశాలలో పోలీసుల విశ్రాంతి

By

Published : Jan 24, 2020, 12:10 PM IST

గుంటూరు జిల్లా మందడం ప్రభుత్వ పాఠశాల సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. రైతుల సహాయ నిరాకరణతో పోలీసులు పాఠశాలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తరగతి గదుల్లో పిల్లలను బయటకు పంపి గదుల్ని సేదతీరడానికి వినియోగించుకున్నారు. బల్లలపై ఉతికిన బట్టలు ఆరేశారు. పోలీసుల చర్యను గ్రామస్థులు తప్పుబట్టారు. తరగతి గదులు ఖాళీ లేక ఉదయం నుంచి విద్యార్థులు చెట్టునీడనే ఉన్నారు. తమ పిల్లలను బయటకు ఎలా పంపుతారంటూ తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

మందడం పాఠశాలలో పోలీసుల విశ్రాంతి

ABOUT THE AUTHOR

...view details