ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కీకారణ్యంలో ఆధిపత్య పోరు... పోలీసులదే పైచేయి!

తెలంగాణలోని భద్రాద్రి అడవుల్లో జరుగుతున్న ఆధిపత్య పోరులో మావోయిస్టులపై పోలీసులు పైచేయి సాధిస్తుండగా.. నక్సల్స్‌కు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. వరుస ఘటనలతో భద్రాద్రి అడవుల్లో మావోలు పద్మవ్యూహంలో చిక్కుకోగా... భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

bhadradri-kothagudem-district
bhadradri-kothagudem-district

By

Published : Sep 25, 2020, 9:51 AM IST

తెలంగాణలోని భద్రాద్రి అడవుల్లో పోలీసుల పద్మవ్యూహంలో మావోయిస్టులు చిక్కుకున్నట్లు వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. జులై 15 మావోయిస్టులు- పోలీసుల మధ్య చెలరేగిన ఎదురుకాల్పులు.. మూడు నెలలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవలి పరిస్థితులతో భద్రాద్రి అడవుల్లో మావోయిస్టులపై పోలీసుల పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. 20 రోజుల్లోనే ఆరుగురిని మట్టుబెట్టిన పోలీసులు... మావోయిస్టులకు దడ పుట్టిస్తున్నారు. చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమవడం వల్ల వారికి గట్టి దెబ్బ తగిలినట్టైంది.

కీకారణ్యంలో ఆధిపత్య పోరు... పోలీసులదే పైచేయి!

ఎన్​కౌంటర్​పై అనేక అనుమానాలు

ఇక బుధవారం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనేక అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. అంతకుముందే సరిహద్దు చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశానికి పెద్దఎత్తున నక్సల్స్‌ హాజరైనట్లు సమాచారం. పోలీసులకూ ఈ సమాచారం అందడం వల్ల భారీ బలగాలు చెన్నాపురం అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే... మరి అసలు రాత్రి వేళ ఎదురుకాల్పులు ఎలా సాధ్యమయ్యాయనేది తెలియడం లేదు. సాయంత్రం అటవీ ప్రాంతాల్లోకి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నట్లు గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మొత్తం 4 వాహనాల్లో పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. అటవీ ప్రాంతంలో కాల్పుల శబ్దాలేమీ పెద్దగా వినిపించ లేదని గిరిజనులు చెబుతుండటం విశేషం. ఇక ఎన్‌కౌంటర్‌ తర్వాత మృతిచెందిన మావోయిస్టులకు పంచనామా నిర్వహించారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు.

నక్సల్స్​ కదలికలపై డేగకన్ను

సెప్టెంబర్‌లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ముఖ్యంగా చర్ల ఏరియాలో వరుస ఎన్ కౌంటర్లు మావోయిస్టులను గుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. ఈనెల 3న దేవల్లగూడెం ఎదురుకాల్పులతో మొదలైన ఎన్‌కౌంటర్ల పరంపర... చెన్నాపురం కాల్పుల వరకు కొనసాగింది. దేవల్లగూడెం కాల్పుల్లో ‍ఒకరు, పూసుగుప్ప ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు, చెన్నాపురం ఎదురుకాల్పుల్లో ముగ్గురు.. ఇలా కేవలం 20 రోజుల్లోనే ఆరుగురు మావోయిస్టులు మృతిచెందడం ఆ పార్టీకి దెబ్బమీద దెబ్బే. కొంతకాలం క్రితం వరకు చత్తీస్‌గఢ్‌ దండకారణ్యం షెల్టర్ జోన్‌గా చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించిన మావోయిస్టులు... కొన్ని నెలల క్రితం తెలంగాణకు మకాం మార్చినట్లు గతంలోనే పోలీసులకు సమాచారం అందింది. పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న వారిని మావోయిస్టు పార్టీ రాష్ట్రంలోకి పంపి కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వారికి బాగా పట్టున్న చర్ల, మణుగూరు, గుండాల అటవీ ప్రాంతాలను స్థావరాలుగా మలుచుకొని తమ కార్యకలాపాలు విస్తృత పరచడం, పార్టీలోకి రిక్రూట్‌మెంట్‌ వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. నక్సల్స్‌ కదలికలపై భద్రతా దళాలు డేగకన్ను వేశాయి. దీని ఫలితమే చెన్నాపురం ఎన్‌కౌంటర్‌ ఘటన. వరుస ఎదురుదెబ్బలతో పోలీసులు పైచేయి సాధిస్తుండగా... మావోయిస్టులకు మాత్రం ఎదురుదెబ్బలు తప్పడం లేదు.

బిక్కుబిక్కుమంటున్న గిరిజన ప్రాంతాలు

వరుస ఘటనలు ఓ వైపు... పోలీసుల కూంబింగ్‌, మావోల సంచారంతో భద్రాచలం ఏజెన్సీ, మన్యం ప్రాంతాలన్నీ నివురు గప్పిన నిప్పులా మారుతున్నాయి. మూడు నెలలుగా గుండాల, మణుగూరు, చర్ల ఏరియాల్లోని అటవీ ప్రాంతాల్లో తరచూ ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకుంటుండటం మన్యంలో గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇవీ చూడండి:

జీవోలో 'ముస్లిం యూత్​' అని ఎలా ప్రస్తావిస్తారు?: హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details