ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Security At Naravaripalle : నారావారిపల్లిలోని చంద్రబాబు ఇంటికి భద్రత కట్టుదిట్టం - నారావారిపల్లిలో పోలీసుల భద్రత

మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై మంగళవారం అల్లరిమూకలు దాడి చేయడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తెదేపా ముఖ్యనేతల ఇళ్లపై దాడులకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Security At Naravaripalle
నారావారిపల్లిలోని చంద్రబాబు ఇంటికి భద్రత కట్టుదిట్టం

By

Published : Oct 20, 2021, 9:00 AM IST

మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై మంగళవారం అల్లరిమూకలు దాడి చేయడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తెదేపా ముఖ్యనేతల ఇళ్లపై దాడులకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలోని ఆయన ఇంటికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో నారావారిపల్లికి చేరుకుని భద్రత చర్యలను తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details